- Advertisement -
ముంబై: బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్(77) పాపులర్ షో ‘కౌన్ బనేగా కరోర్‌పతి’(కెబిసి)12వ సీజన్ షూటింగ్‌ను ప్రారంభించినట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆదివారం జరిగిన షూటింగ్లో తనతోపాటు ఆ షో సహాయక సిబ్బంది పిపిఇ కిట్లు ధరించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కెబిసిని 2000 సంవత్సరంలో ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా అమితాబ్ గుర్తు చేశారు. 20 ఏళ్లుగా కొనసాగిన షో కరోనా మహమ్మారి వల్ల నిలిచిపోయిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ షో 11 సీజన్లు పూర్తి చేసుకున్నది. ఇటీవలే అమితాబ్ కరోనా నుంచి కోలుకొని ముంబైలోని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే.
Amitabh Bachchan starts Shoot for KBC 12th Season
- Advertisement -