Wednesday, May 1, 2024

కెబిసి షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్(77) పాపులర్ షో ‘కౌన్ బనేగా కరోర్‌పతి’(కెబిసి)12వ సీజన్ షూటింగ్‌ను ప్రారంభించినట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆదివారం జరిగిన షూటింగ్‌లో తనతోపాటు ఆ షో సహాయక సిబ్బంది పిపిఇ కిట్లు ధరించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కెబిసిని 2000 సంవత్సరంలో ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా అమితాబ్ గుర్తు చేశారు. 20 ఏళ్లుగా కొనసాగిన షో కరోనా మహమ్మారి వల్ల నిలిచిపోయిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ షో 11 సీజన్లు పూర్తి చేసుకున్నది. ఇటీవలే అమితాబ్ కరోనా నుంచి కోలుకొని ముంబైలోని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే.

Amitabh Bachchan starts Shoot for KBC 12th Season

Amitabh Bachchan starts Shoot for KBC 12th Season

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News