టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు లేటెస్ట్ మేకోవర్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. తన లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం రెడీ అవుతున్న లాంగ్ హెయిర్ లుక్‌లోనే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ చిత్రం షూట్‌కు ఇంకా సమయం ఉండగానే మహేష్ లుక్ ఎలా ఉండనుందో బయటకు వచ్చేసింది. ఇక అలాగే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో దర్శకుడు పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అందుకే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు అనీల్ కపూర్‌ను ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం మాట్లాడుతున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజం అయినట్లయితే ఈ సినిమాతోనే మహేష్ పాన్ ఇండియా ఎంట్రీ ఖాయమని చెప్పాలి. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.
Anil Kapoor plays villain role in Sarkaru Vaari Paata?