Monday, May 6, 2024

పాలిసెట్ ఫలితాలు విడుదల..

- Advertisement -
- Advertisement -

TS Polycet Results 2020 released

మనతెలంగాణ/హైదరాబాద్: పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 2వ తేదీన జరిగిన పాలిసెట్ పరీక్షకు 56,945 మంది విద్యార్థులు హాజరుకాగా, 46,207 మంది(81.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిసెట్ ఫలిలాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్,ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ డాక్టర్ సుధీర్‌కుమార్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 34,748 మంది బాలురుకు 27,354 మంది(78.72శాతం) ఉత్తీర్ణులు కాగా, 22,197 మంది బాలికలకు 18,853 మంది(84.53 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
రేపటి నుంచి కౌన్సెలింగ్
పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకుని, ఫీజు చెల్లించాలి. 14 నుంచి 18వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించ నున్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి.ఈ నెల 22న మొదటి విడత సీట్లు కేటాయించ నున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోరింగ్ చేయాలి. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 30వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అక్టోబర్ 3న తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్లు కేటాయించనున్నారు. ఈ అక్టోబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు ఆయా కళాశాలల్లో కూడా రిపోర్టింగ్ చేయాలి. అదే నెల 7వ తేదీ నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8న మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

Telangana Polycet Results Website1
Telangana Polycet Results Website2
Telangana Polycet Results Website3

TS Polycet Results 2020 released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News