Tuesday, May 14, 2024

సంజు బ్యాటింగ్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యా: మంధాన ట్వీట్ వైరల్

- Advertisement -
- Advertisement -

ముంబై: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లో పరుగుల వరద పారిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ బ్యాటింగ్‌కి భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఫిదా అయ్యింది. ఈ విషయాన్ని మంధాన స్వయంగా వెల్లడించింది. ఐపిఎల్‌లో సంజు బ్యాటింగ్‌ను చూసి తాను క్లీన్‌బౌల్డ్ అయ్యానని పేర్కొంది. ఐపిఎల్‌లో చాలా మంది మెరుగ్గా రాణిస్తున్నా తనకు శాంసన్ బ్యాటింగ్ తీరు చాలా నచ్చిందని తెలిపింది. అతను కొడుతున్న సిక్సర్లు తనను కట్టి పడేస్తున్నాయని వివరించింది. సంజు బ్యాటింగ్‌లో ఏదో మాయ ఉందని, దాన్ని చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని పేర్కొంది. కాగా, సంజును పొగుడుతూ మంధాన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

I’m Crazy about Sanju Samson’s batting: Smriti Mandhana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News