Tuesday, May 7, 2024

యుపిలో అరాచ‌క పాల‌న: రాహుల్

- Advertisement -
- Advertisement -

Shameful truth is many Indians don't consider Dalits

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ లో అరాచ‌క పాల‌న కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపి రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. హ‌థ్రాస్ అత్యాచారం, బాధితురాలి మృతి ఘ‌ట‌నపై యుపి సర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖరిని రాహుల్ గాంధీ‌ మ‌రోసారి తూర్పారబట్టారు. దేశంలో దళితులు, ముస్లింలు, గిరిజనులను మనుషులుగా పరిగణించడం లేదని, ఇది సిగ్గుపడాల్సిన నిజ‌మ‌ని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో మ‌నిషిని మ‌నిషిగా చూడ‌క‌పోవ‌డం ఘోరమన్నారు. యుపి సిఎం, పోలీసులు ఎవ‌రిపైనా అత్యాచారం చేయలేదని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయన ఫైర్ అయ్యారు. అంటే వారి దృష్టిలో హ‌థ్రాస్ బాధితురాలు మ‌నిషే కాదా..? అని రాహుల్ ప్ర‌శ్నిస్తూ ఈ మేర‌కు ఆదివారం ట్వీట్ చేశారు.

 

 

Shameful truth is many Indians don’t consider Dalits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News