Monday, April 29, 2024

అప్రమత్తంగా ఉండండి: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Beware of heavy rains in Telangana Says CM KCR

హైదరాబాద్: రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో నేడు వర్షాలు కురుస్తున్నాయి. సోమ-మంగళవారాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారయంత్రంగా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు. అయితే హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజాము నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News