Wednesday, May 15, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Cricket betting gang arrested in Hyderabad
రూ.70,000 నగదు స్వాధీనం

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.70,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని హుస్సేనీఆలం, మూసాబౌలికి చెందిన ఎండి ఆరిఫ్, పర్వేజ్ కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. diamondexch9.com, క్రికెట్‌గురు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బిగ్ బాష్ లీగ్(బిబిఎల్)లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పర్వేజ్ బెట్టింగ్ కట్టేవారికి లింక్, యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఇస్తున్నారు. పంటర్ల సాయంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహించినందుకు 3శాతం కమీషన్ తీసుకుంటున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు కోసం బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News