Tuesday, May 7, 2024

గుట్కా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Police raid Gutka Manufacturing Center in Mallapur

హైదరాబాద్: నిషేధిత గుట్కా తయారీ కేంద్రంపై ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, బాలాపూర్ పోలీసులు దాడి చేసి తయారు చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారయ్యాడు. తయారీ కేంద్రం నుంచి రూ.45లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను, తయారీ మిషన్‌ను, వివిధ రకాల గుట్కాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలానికి చెందిన మల్లాపూర్‌కు చెందిన ఎండి లతీఫ్ ఖాన్ నిషేధిత గుట్కాను తయారు చేస్తున్నాడు. మల్లాపూర్‌లోని బాలాజీ నగర్‌లో ఉంటూ గుట్కాను తయారు చేస్తున్నాడు. వివిధ రకాల గుట్కాల బ్రాండ్ల పేర్లతో తయారు చేసి స్థానికులకు విక్రయిస్తున్నాడు.

లతీఫ్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గుట్కా తయారు చేసి విక్రయిస్తున్నాడు. మూడు నెలల క్రితం బాలాపూర్ పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మల్లాపూర్‌లో మరో వ్యక్తి మహ్మద్ యూనిస్ సాయంతో గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు కలిసి 18రకాల బ్రాండ్ల గుట్కాను తయారు చేస్తున్నారు. కిరాణాషాపులు, పాన్ షాపులకు సరఫరా చేస్తున్నారు. సమాచారం రావడంతో ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ భాస్కర్, రవికుమార్, ఎస్సై రాజు తదితరులు దాడి చేశారు.

Police raid Gutka Manufacturing Center in Mallapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News