Friday, May 3, 2024

బైడెన్ తొలి సంతకాలు వీటిపైనే..

- Advertisement -
- Advertisement -

బైడెన్ తొలి సంతకాలు వీటిపైనే..
తొలి రోజే డజనుకు పైగా కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్న నూతన అధ్యక్షుడు
పారిస్ ఒప్పందంలో చేరడం, కరోనా కట్టడి, వలస కుటుంబాలకు ఊరట వంటి వాటిపై నిర్ణయాలు
కాబోయే వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ వెల్లడి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనతో విసిగిపోయిన ఆ దేశ ప్రజల్లో జో బైడెన్ ఇచ్చిన కొత్త హామీలు ఆశలు చిగురింప జేశాయి. అందుకే ఎన్నికల్లో వారు ఆయనకు పట్ట గట్టారు. ఆ హామీలను సాకారం చేసే దిశగా ఆయన కార్యాచరణను ప్రారంభించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే(ఈ నెల 20న)పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేయనున్నారని వైట్‌హౌస్ లో కాబోయే చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ శనివారం చెప్పారు. ప్రమాణ స్వీకారం ముగిసి ఓవల్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టిన వెంటనే దాదాపు 12 కీలక ఫైళ్లపై బైడెన్ సంతకం చేయనున్నట్లు క్లెయిన్ చెప్పారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. పారిస్ ఒప్పందంలో చేరడం, కొవిడ్‌ఆంక్షలను విస్తరించడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం వంటి కీలక అంశాలపై తొలి రోజే బైడెన్ నిర్ణయం తీసుకోన్నుట్లు తెలుస్తోంది. అలాగే ట్రంప్ నిబంధనల వల్ల పిల్లలకు దూరమైన వలప వచ్చిన తల్లిదండ్రుల విషయంలో బైడెన్ మానవత్వంతో వ్యవహరించనున్నట్లు సమాచారం. వారంతా తిరిగి కలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో రోజు పూర్తిగా కరోనా వ్యాప్తిని అరికట్టడం, విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవలసిన జాగ్రతలపై బైడెన్ దృష్టిపెట్ట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచడం, కరోనా యోధులకు మరింత రక్షణ కల్పించడం సహా క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య ప్రమాణాలు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిస్తోంది. అలాగే వందరోజులు మాస్క్‌ను తప్పనిసరి చేసే దిశగా కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ‘అధ్యక్షుడు బైడెన్ నాలుగు తీవ్ర సమస్యలను మన దేశం ఎదుర్కొంటున్న సమయంలో బాధ్యతలు చేపడుతున్నారు. కొవిడ్19 సంక్షోభం, ఫలితంగా ఎదురైన ఆర్థిక సంక్షోభం, వాతావరణ సమస్య, జాతి సమానత్వసంక్షోభం అనేవి ఈ నాలుగు సంక్షోభాలు. ఈ అన్ని సంక్షోభాలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఈ నాలుగు సంక్షోభాలను పరిష్కరించడానికి అవసరమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంతో పాటుగా ఇతర హాని కలిగించే నష్టాలను నిరోధించి ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధరిఇంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు’ అని రోన్ క్లెయిన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Joe Biden to sign on 12 key files as US President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News