Wednesday, May 1, 2024

ఒక్క రోజులో $15 బిలియన్లు నష్టపోయిన మస్క్

- Advertisement -
- Advertisement -

Musk lost $ 15 billion in a single day

 

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ నికర విలువ ఒక్క రోజులోనే 15.2 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆయన కంపెనీ టెస్లా షేరు 8.6 శాతం పడిపోవడం భారీగా నష్టపోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి ట్యాగ్‌ను కోల్పోనున్నారు. సెప్టెంబర్ నుంచి టెస్లా షేరు భారీగా పతనమవుతోంది. అయితే గత వారాంతంలో బిట్‌కాయిన్ ధరలు, చిన్న ప్రత్యర్థి ఎథర్ పెద్ద కనిపిస్తోందంటూ ఎలోన్ మస్క్ చేసిన వ్యాఖ్యలతో షేరుపై తీవ్ర ప్రభావం చూపాయి. బ్యాలెన్స్ షీట్‌కు బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లు చేర్చినట్టు ప్రకటించిన రెండు వారాల తర్వాత ట్విట్టర్‌లో తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలో 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో నికర విలువ 183.4 బిలియన్ డాలర్లతో మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. జనవరిలో అత్యంత గరిష్ట స్థాయి 210 బిలియన్ డాలర్ల నికర విలువను కల్గివున్నారు. ఇప్పుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్ నికర విలువ 3.7 బిలియన్ డాలర్లు పడిపోయినప్పటికీ 186.3 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News