Wednesday, May 15, 2024

హిందూమహాసముద్రంలో భారత్, అమెరికా నేవీ విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

The Indian and US Navy Maneuvers began

 

న్యూఢిల్లీ : హిందూమహాసముద్రం తూర్పు రీజియన్‌లో ఆదివారం భారత్, అమెరికా నేవీ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రక్షణ, సైనిక భాగస్వామ్యంలో ఇరు దేశాల సమానత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. భారత నావికాదళం తన యుద్ధనౌక శివాలిక్‌ను, సుదూర స్థాయి నిఘా యుద్ధ విమానం పి81ని సముద్ర జలాల్లో ప్రవేశ పెట్టగా, అమెరికా నేవీ యుఎస్‌ఎస్ థియొడోర్ రూజ్వెల్టు వాహక విధ్వంస నేవీ నౌకలను, ఇతర నౌకలను ప్రవేశ పెట్టింది. భారత వైమానిక దళం కూడా ఈ విన్యాసాల్లో నేవీతో ఉమ్మడిగా పాల్గొనడం ఇదే మొదటిసారి. అమెరికా నేవీ అనుసరించే వాయు క్షిపణి రక్షణ, వాయు క్షిపణి విధ్వంక వ్యూహాల్లో శిక్షణ పొందే అవకాశాన్ని వినియోగించుకోవడమే ఈ విన్యాసాల లక్షంగా ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు సోమవారం కూడా కొనసాగుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News