Tuesday, April 30, 2024

తీవ్రం..వేగం

- Advertisement -
- Advertisement -

రానున్న 4వారాలు అత్యంత కీలకం

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి.. మార్గదర్శకాలు పాటించాలి
పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను పెంచాలి: కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 వేగంగా విస్తరిస్తోందని, గతంలో కంటే తీవ్రత పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. రానున్న నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపింది. ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంలాంటి మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నతీరుపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం సమీక్ష నిర్వహించింది. దేశంలో కేసులు పెరగడానికి ప్రజల్లో నిర్లక్షం కూడా కారణమని నీతి ఆమోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ అన్నారు. కొవిడ్ పరీక్షలు పెంచడం, కంటైన్‌మెంట్ జోన్ల నిర్వహణలాంటివి సక్రమం గా జరగాలని ఆయన సూచించారు. వ్యాక్సినేషన్‌ను పె ద్ద ఎత్తున కొనసాగించాలని తెలిపారు. ప్రజలు గుంపులుగా చేరకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. సెకండ్‌వేవ్ నుంచి బయటపడటానికి ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ఆయన హితవు పలికారు. రానున్న నాలుగు వారాలు అత్యంత కీలకమని పాల్ హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యల వల్ల మరణాల రేట్‌ను తగ్గించగలిగామన్నారు.
కొవిడ్19 యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న 10 జిల్లాల్లో చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ ఒకటని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ తెలిపారు. మిగతా 9 జిల్లాల్లో ఏడు మహారాష్ట్రలో, కర్నాటక, ఢిల్లీల్లో ఒకటి చొప్పున ఉన్నాయన్నారు. మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఉన్నదన్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే పంజాబ్, చత్తీస్‌గఢ్‌ల్లో మరణాలు అధికంగా ఉన్నాయన్నారు. వైద్య నిపుణులతో 50 బృందాలను ఏర్పాటు చేసి, కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పంపినట్టు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు 30, చత్తీస్‌గఢ్‌కు 11, పంజాబ్‌కు 9 బృందాలను పంపినట్టు ఆయన తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో ఇమ్యూనైజేషన్‌ను చేపట్టినట్టు ఆయన తెలిపారు.

Next 4 weeks very critical says Union Health ministry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News