Friday, May 3, 2024

ఎపిలో కొత్తగా 9,716 కేసులు.. 37మంది మృతి

- Advertisement -
- Advertisement -

9716 New Corona Cases Reported in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, అందులో కొత్తగా 9,716 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 986703 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7510 మంది మృతి చెందారు. ఇక కొత్త మరణాలు కృష్ణా జిల్లాలో 10 మంది, నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 3,359 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 918985 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 60,208 ఉన్నట్లు తెలిపింది.
జడ్జీ, న్యాయవాదులకు:
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కోర్టులో పలువురు న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా కరోనా బారిన పడ్డారు.గుంటూరు జిల్లా కోర్టులో అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తున్న రవికి తాజాగా కరోనా సోకడంతో చనిపోయారు. ఆ తర్వాత మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురు న్యాయమూర్తులతో పాటు 12 మంది న్యాయవాదులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు రావాలంటేనే జడ్జీలు, లాయర్లు, కక్షిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కోర్టు ఆవరణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కక్షిదారులకూ కరోనా సోకడంతో వాయిదాలకు హాజరయ్యే పరిస్దితి కనిపించడం లేదు. ఇప్పటికే నగరంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా జిల్లా అధికారులు భారీగా ఆంక్షలు విధించారు.

9716 New Corona Cases Reported in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News