Sunday, May 19, 2024

కొవిడ్ కొత్త వేరియంట్ లంబ్డా

- Advertisement -
- Advertisement -

new lambda covid variant discovered in britain

లండన్ : కరోనా కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలమౌతుంటే లంబ్డా అనే కొత్త వేరియంట్ బ్రిటన్‌లో కనిపించిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) తెలియచేసింది. గతవారం బ్రిటన్‌లో 99 శాతం కొవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉన్నాయి. తాజాగా లంబ్డా వేరియంట్‌కు చెందిన ఆరు కేసులు ఉన్నట్టు పిహెచ్‌ఇ పేర్కొంది. వీటిలో అయిదు ఓవర్‌సీస్ ట్రావెల్‌తో ముడిపడి ఉన్నట్టు వివరించింది. ఈ కొత్త వేరియంట్ ప్రభావంపై పరిశీలన జరుగుతోందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లంబ్డా వేరియంట్‌ను 2020 ఆగస్టులోనే కనుగొన్నట్టు చెప్పింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో ముఖ్యంగా అర్జంటీనా, చిలీ సహా లాటిన్ అమెరికాలో ఈ వేరియంట్ కనిపించిందని డబ్లుహెచ్‌ఒ తెలియచేసింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు పెరూలో నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం లంబ్డా వేరియంట్ కేసులు ఉన్నాయని, చిలీలో గత 60 రోజుల్లో నమోదైన కేసుల్లో 32 కేసులు లంబ్డా వేరియంటేనని తేలిందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News