Friday, April 26, 2024

ఓటీటీలోనే ‘నార‌ప్ప’ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Narappa' Movie to release in OTT on July 24

హైదరాబాద్: క‌రోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో లాక్ డౌన్ ఎత్తేసిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు థియేట‌ర్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించినా.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు థీయేటర్ కు వస్తారో? లేదోనని దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటిటిలోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు ఓటిటిలో విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా కూడా ఓటిటిలో విడుదలవుతుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటిటిలోనే విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మొదట ‘నార‌ప్ప’ సినిమాను థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు భావించినా.. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు నేపథ్యంలో ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణయించారు. దీంతో జులై 24న అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో నేరుగా సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో వెంక‌టేశ్ భార్య‌గా ప్రియ‌మ‌ణి న‌టించింది. తమిళంలో ‘అసురన్’ మంచి విజయం సాధించడంతో నార‌ప్పపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతోపాటు వెంక‌టేశ్ న‌టిస్తున్న మరో చిత్రం ‘దృశ్యం 2’, నితిన్ ‘మాస్ట్రో’ కూడా ఓటీటీలోనే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

‘Narappa’ Movie to release in OTT on July 24

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News