Tuesday, April 30, 2024

అమెరికా వెళ్లేందుకు సుజనాచౌదరికి హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

High court allowed Sujana Chowdary US travel

హైదరాబాద్: అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి అనుకూల తీర్పు వచ్చింది. అమెరికా వెళ్లేందుకు ధర్మాసనం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికా వెళ్లొచ్చని తెలిపింది. యూఎస్ఏకు వెళ్లే ముందు.. వచ్చాక సీబీఐకి వివరాలు సమర్పించాలని హైకోర్టు షరతు విధించింది. అమెరికాలో ఓ సదస్సుకు హజరయ్యేందుకు తనకు అనుమతినివ్వాలని కోరుతూ సుజనా చౌదరి ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు కోసం తనకు ఆహ్వానం అందిందని ధర్మాసనానికి సుజనాచౌదరి తెలిపారు. లుకౌట్ నోటీసు పెండింగ్లో ఉన్నందున అనుమతివ్వాలని పిటిషన్లో కోరారు. పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. జులై రెండో వారంలో అమెరికాలో సదస్సుకు హాజరు కావాల్సి ఉందని, సదస్సు కోసం అమెరికా నుంచి ఆహ్వానం అందిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం షరతులతో కూడిన అనుమతినిచ్చింది.

High court allowed Sujana Chowdary US travel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News