Tuesday, May 7, 2024

నగరంలో మళ్లీ చెడ్డి గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

Cheddi gang hulchul again in hyderabad

రాచకొండ పరిధిలో చోరీలు
శివారు ప్రాంతాలే టార్గెట్
పోలీసులు జల్లెడ పడుతున్నా చిక్కడం లేదు

హైదరాబాద్: నగరంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ నేరాలు కలకలం సృష్టిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో వరుసగా చోరీలు జరగడంతో పోలీసులు ఒక్కసారి అప్రమత్తమయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేసి చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. బనియన్లు, చెడ్డీలు ధరించి దొంగతనానికి రావడం, అలాగే పట్టుబడకుండా ఒంటికి ఆయిల్ రాసుకుని నిందితులు చోరీలకు వస్తుంటారు. వీరి ముఠా ఒకదానిలో 15మంది వరకు ఉంటారు. చేతిలోని రాడ్‌తో తాళాలను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకుంటారు.

నగర శివారులోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని ఉంటూ పగటి సమయంలో బొమ్మలు, బ్లాంకెట్లు విక్రయించేందుకు వచ్చినట్లు నటించి రెక్కీ నిర్వహిస్తారు. డబ్బులు బాగా ఉన్న వారిని గుర్తించి రాత్రి సమయంలో చోరీలు చేస్తుంటారు. ఆదివాసీ ప్రాంతాలకు చెందిన వీరు పోలీసులకు పట్టుబడినా కూడా మిగతా వారి గురించి ఒక్కముక్క కూడా పోలీసులకు చెప్పరు. దీంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులకు కష్టంగా మారింది. అంతేకాకుండా అటవీ ప్రాంతాల్లో ఉండడంతో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లడం అక్కడి వారిని పట్టుకోవడం చాలా కష్టమైన పని, దీనిని ఆసరాగా చేసుకుని చోరీలు చేస్తున్నారు.

కరోనాతో ఆగిన చోరీలు…

గత ఏడాది నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చోరీలు చేసేందుకు అంతరాష్ట్ర ముఠాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండడం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దొంగతనానికి అంతరాష్ట్ర ముఠాలు రాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్‌లాక్ కావడం, రవాణా సౌకర్యాలు పునరుద్ధరణ కావడంతో మళ్లీ చోరీలు చేసేందుకు చెడ్డీ గ్యాంగ్ నగరానికి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News