Friday, April 26, 2024

పెగాసస్ ప్రాజెక్టు నివేదికకు కట్టుబడి ఉన్నాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పెగాసస్ ప్రాజెక్టులో వెల్లడించిన వివరాలను అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం గట్టిగా సమర్థించుకుంది. అంతేకాదు ఆ నివేదికలోని డేటాకు ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు చెందిన మెగాసస్ స్పైవేర్ టార్గెట్లుగా చేసుకున్న వారికి తిరుగులేని సంబంధాలున్నాయని స్పష్టం చేసింది. పెగాసస్ స్పైవేర్ టార్గెట్‌గా చేసుకున్న వారి వివరాలను ముఖ్యంగా ఫోన్ నంబర్లను ఆమ్నెస్టీ ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. పెగాసస్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున జర్నలిస్టులు, హక్కుల ఉద్యమ కార్యకర్తలు, ఇతరులను చట్ట వ్యతిరేకంగా టార్గెట్‌గా చేసుకుందన్న వార్తల నుంచి పక్క దారి పట్టించే ఉద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది. పెగాసస్ ప్రాజెక్టు బైటపెట్టిన విషయాలతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పూర్తిగా ఏకీభవిస్తోందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తల ఫోన్లను టార్గెట్ చేయడానికి ఎన్‌ఎస్‌ఓ సంస్థ అభివృద్ధి చేసిన ఇజ్రాయెలీ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని గత వారం 17 మీడియా సంస్థలు ప్రచురించిన ఓ అంతర్జాతీయ దర్యాప్తు నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. పారిస్‌కు చెందిన జర్నలిజం స్వచ్ఛంద సంస్థ ఫర్‌బిడన్ స్టోరీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ కన్సార్టియంకు నాయకత్వం వహించాయి. ఇలా టార్గెట్‌గా చేసుకున్న వారిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిజెపి మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, మాజీ ఎన్నికల అధికారి అశోక్ లావాసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో పాటు భారత్‌కు చెందిన పలువురు ఉన్నట్లు ఈ కన్సార్టియంలో భాగమైన ‘ ది వైర్’ పత్రిక వెల్లడించిన విషయం తెలిసిందే.

Fully stand by Pegasus Project: Amnesty International

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News