Wednesday, May 1, 2024

ఆ ఇద్దరి బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

Shower of praise on Mohammad Shami and Jaspreet Bumra

 

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చారిత్రక బ్యాటింగ్‌తో అదరగొట్టిన మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు దిగిన షమి, బుమ్రాలు తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లతో భారత్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించారు. అప్పటి వరకు మ్యాచ్‌ను శాసించే స్థితిలో ఉన్న ఇంగ్లండ్ నుంచి టెస్టును మళ్లీ టీమిండియా చేతుల్లోకి తీసుకొచ్చారు. బుమ్రా, షమిల ఇన్నింగ్స్‌లనూ గతంలో రాహుల్ ద్రవిడ్‌వివిఎస్ లక్ష్మణ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన చారిత్రక ఇన్నింగ్స్‌లతో పోల్చుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరూ కొనసాగించిన బ్యాటింగ్ తీరును పలువురు ప్రశంసించారు.

భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, లక్ష్మణ్, హర్భజన్,ద్రవిడ్ తదితరులు కొనియాడారు. బిసిసిఐ కార్యదర్శి జై షా కూడా వీరిపై ప్రశంసలు కురిపించారు. లార్డ్ టెస్టు రెండో ఇన్నింగ్‌లో బుమ్రా 64 బంతుల్లో మూడు ఫోర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక దూకుడుగా ఆడిన షమి 70 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 56 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అబేధ్యంగా 89 పరుగులు జోడించారు. వీరిద్దరి చారిత్రక బ్యాటింగ్ వల్ల భారత్ ఓటమి కోరల్లో నుంచి మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News