Saturday, April 27, 2024

తాలిబన్లకు పాక్, చైనా, రష్యా మద్దతు

- Advertisement -
- Advertisement -

Pak, China and Russia support the Taliban

అఫ్ఘన్లు బానిస సంకెళ్లు తెగ్గొట్టారు : ఇమ్రాన్ ఖాన్
ఇది అమెరికా పాపమే : బ్రిటన్

న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు బానిస సంకెళ్లను తెగగొట్టారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అఫ్ఘన్‌లో మానసిక బానిసత్వ సంకెళ్లను వారు పగులగొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తరాలుగా వస్తున్న సాంస్కృతిక పరమైన బానిసత్వ సంకెళ్లను తెగగొట్టడం అంత సులభం కాదని, కానీ వాళ్ళు ఆ పని చేశారని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఇదే జరిగిందన్నారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయనతాలిబన్లు సాధారణ ప్రజలవంటి వారేనని వ్యాఖ్యానించారు.అటు- ఇస్లామాబాద్ లో సింగిల్ నేషనల్ కరిక్యులమ్ ప్రారంభించిన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాటాల్డారు. పాక్ లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయని, ఇది ఇతరుల సంస్కృతిని అనుసరించడానికి దారి తీస్తోందని పేర్కొన్నారు. ఒకసారి ఒక కల్చర్ కి అలవాటు పడ్డాక ఇక మనమే సుపీరియర్ అని భావిస్తామని, అది బానిసత్వం కన్నా దారుణమైనదని అన్నారు. మరోవైపు అఫ్ఘాన్‌లో తాలిబన్లతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నామని రష్యా ప్రకటించింది.

వారిని దేశపాలకులుగా గుర్తించడం తొందరపాటు కాక పోయినప్పటికీ, తాలిబన్ల ధోరణిని నిశితంగా గమనిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. తాలిబన్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించింది. అఫ్ఘనిస్తాన్‌లో అన్ని ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలని చైనా సూచించింది. తాలిబన్లతో స్నేహ సంబంధాలకు తాము అనుకూలమేనని పేర్కొంది. ప్రజల రక్షణ బాధ్యత తీసుకుంటామని తాలిబన్లు ప్రకటించారని, విదేశాలతో యథావిధిగా దౌత్య సంబంధాలు కొనసాగిస్తామని అంటున్నారని, అధికార మార్పిడి సజావుగా సాగాలని తాము భావిస్తున్నట్టు చైనా విదేశాంగ ప్రతినిధి చున్‌యింగ్ ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం వైఫల్యం వల్లే అప్ఘన్ తాలిబన్ల వశం అయ్యిందని బ్రిటన్ అభిప్రాయపడింది. అమెరికా తన పనిని మధ్యలోనే ముగించుకుని పోయిందని అమెరికాపై బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వల్లేస్ మండిపడ్డారు. అఫ్ఘన్ పూర్తికాని సమస్యగా మారిపోయిందని, ప్రపంచమంతా ఆ దేశానికి అండగా నిలవాల్సిన అవసరముందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News