Tuesday, April 30, 2024

భారత్ చేరుకున్న అఫ్ఘన్లకు పోలీయో టీకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వస్తున్నవారికి ఉచితంగా పోలియో టీకాలు ఇస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవ్య తెలిపారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారికి పోలీయో టీకాలు వేస్తున్న ఫోటోను మాండవ్య తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పోలీయో తీవ్రత ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ ఉన్నాయి. భారత వైమానిక దళ విమానం(ఐఎఎఫ్)లో అఫ్ఘన్ నుంచి ఆదివారం 168 మంది ఢిల్లీ చేరుకోగా, వారిలో 107 మంది భారతీయులు, మిగతావారు అఫ్ఘన్ జాతీయులు. వారం రోజుల క్రితం అఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో వారి ఉగ్ర చర్యల భయంతో భారత్‌సహా పలు దేశాలకు వేలాదిమంది శరణార్థులుగా వెళ్తున్నారు.

India to free polio drops for all Afghan Returnees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News