Tuesday, December 3, 2024

ఘనంగా రాఖీ పండుగ

- Advertisement -
- Advertisement -

Raksha bandhan festival 2021

హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండుగతో ప్రతి ఇంట ఆనందం వెల్లువిరిసింది. తొబుట్టువులతో రాకతో ప్రతి ఇళ్లు కళకళలాడింది. ఆదివారం నగరంలో ఏ ఇంట్లో చూసినా ఈ అపురూప దృష్యాలే ఆవిష్కృతమైయ్యాయి. పేద, గొప్ప, కులం, మతం అన్నా తేడా లేకుంగా రక్షా బంధన్‌ను ఘనంగా జరుపుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా తమ సోదరులకు రాఖీ కట్టలేకపోయిన ఆడపడుచులు ఈ ఏడాది మాత్రం ముందుగానే పుట్టింళ్లకు చేరుకుని ఆనందగా గడిపారు. అక్క చెల్లెళ్లు, తమ అన్నాదమ్ములకు ప్రేమానురాగాలతో కుంకుమ తిలకాలు దిద్ది రాఖీ కట్టి మిఠాయిలు తినిపించగా, అన్నదమ్ముల తమ తోబుట్టువులకు వారి తహత్తుకు తగ్గట్లుగా బహుమతులు అందజేశారు. సోదరులు లేని అక్క చెల్లెళ్లు తమ పక్కింటి వారి రాఖీలు కట్టగా, అక్కా చెల్లెళ్లు లేని అన్నదమ్ములకు ఇరుగు పోరుగు సోదరిమణులు రాఖీలు కట్టి వారి ముఖాల్లో ఆనందం నింపారు.

పలు స్వచ్చంధ సంస్థలకు మహిళా ప్రతినిధులు చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు రాఖీ కట్టారు. మరోవైపు ఆడపడుచు మెట్టినిళ్లు నుంచి తమ పుట్టింటికి తరలి వెళ్లడంతో నగర దారులన్ని పల్లెల వైపు పరుగులు తీశాయి. దీంతో నగర నలూమూల రోడ్లన్ని వాహనాలతో కిటకిటలాడాయి. పండుగ పూట కావడంతో నగరంలో రాఖీ దుకాణాలు, మిఠాయి షాపులు కిక్కిరిసి పోయ్యాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆయన సోదరిమణులు రాఖీలు కట్టగా, సిఎం తన అక్కల అశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కె.కవిత తన సోదరులు మున్సిపల్ శాఖమంత్రి కె.తారక రామారావుతో పాటు ఎంపి సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఆయన సోదరీమణులు రాఖీలు కట్టగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఆయన సోదరిమణులు రాఖీలు కట్టారు. అదేవిధంగా జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవితో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు మంత్రి కెటిఆర్‌కు ప్రగతి భవన్‌లో రాఖీ కట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News