Tuesday, April 30, 2024

2021 చివరికల్లా లక్ష డాలర్లకు చేరనున్న బిట్‌కాయిన్

- Advertisement -
- Advertisement -
bitcoin
బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుడి వెల్లడి

న్యూయార్క్ : డిజిటల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్ ఇటీవల చాలా హెచ్చుతగ్గులకు గురయింది. ఈ ఏడాది చివరికల్లా అది లక్ష డాలర్లు(దాదాపు రూ. 73.65 లక్షలు) చేరవచ్చని బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుడు మైక్ మెక్‌గ్లోన్ ట్వీట్‌చేశారు. కామాడిటీ స్ట్రాటజిస్ట్ అయిన ఆయన బిట్‌కాయిన్ 2021లో గణనీయ పెరుగుదలను చూడగలదన్నారు. ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ను జనస్రవంతిలోని చాలా మంది కొంటున్నారన్నారు. బిట్‌కాయిన ఊహించనిరీతిలో ర్యాలీ చేయగలదన్నారు. ఏప్రిల్-మే నెలలో బిట్‌కాయిన్ ధర క్రాష్‌కు గురయి దిద్దుబాటు జరిగిందని, కనుక ఇక పెద్ద ఎత్తున ర్యాలీకి ఆస్కారం ఉందని, తద్వారా అది పెద్ద దిగ్భ్రాంతిని కూడా కలిగించనుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ 45,542 డాలర్లు(దాదాపు రూ. 33.54లక్షల) వద్ద ట్రేడవుతోందని, అది 50,000డాలర్లు(దాదాపు రూ. 36.83 లక్షలు) మార్కును దాటొచ్చని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 20( మధ్యాహ్నం 2.53 గంటలకు) భారత్‌లో బిట్‌కాయిన్ ధర రూ. 36.6లక్షలుగా ఉందని కాయిన్ మార్కెట్ క్యాప్ వెల్లడించారు. బిట్‌కాయిన్ సప్లయ్ 21 మిలియన్‌లకే పరిమితం. సప్లయ్ తగ్గిపోతున్నందున దాని ధర పెరగవచ్చని మెక్‌గ్లోన్ అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బిట్‌కాయినే మంచి హెడ్జింగ్ కాగలదని చాలా మంది భావిస్తున్నారు. ఏప్రిల్-మేలో వచిన క్రాష్‌లో క్రిప్టో కరెన్సీలో పెద్దవైన బిట్‌కాయిన్, ఎథెరియం నిలదొక్కుకున్నాయన్నది ఇక్కడ గమనార్హం. షేర్‌మార్కెట్‌కు సంబంధించిన బ్లూమ్‌బర్గ్ క్రిప్టోకరెన్సీ గురించి తన సెప్టెంబర్ ఎడిషన్‌లో బిట్‌కాయిన్ లక్ష డాలర్లకు, ఎథెరియం 5000డాలర్లకు(దాదాపు రూ. 3.68లక్షలకు) చేరొచ్చని పేర్కొంది. వాటికి నిరోధం తక్కువే ఉండగలదని కూడా పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News