Tuesday, April 30, 2024

కొత్త నాగచైతన్యను చూస్తారు

- Advertisement -
- Advertisement -

Shekhar Kammula Interview about 'Love Story'

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన చిత్రం ‘లవ్ స్టోరి’. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అదే హైలైట్…
ఫీల్ గుడ్ మూవీ ‘లవ్ స్టోరీ’. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని మరో స్థాయిలో ఉంచుతుంది. అదే ఈ సినిమాకి హైలైట్.
అవన్నీ ప్రత్యేకంగా…
నాగచైతన్యను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం. సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యని చూస్తారు. అంతే కాదు అతని తల్లిగా ఈశ్వరిభాయి చాలా బాగా చేసింది.
కష్టపడి చేసింది…
సాయి పల్లవి ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. ‘ఫిదా’లో తన రోల్ ఒకలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఆమె కనిపిస్తుంది. తన పాత్రను ఆమె చాలా కష్టపడి చేసింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు.
ధనుష్‌తో మల్టీ లాంగ్వెజెస్‌లో…
లీడర్ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు. నెక్ట్స్ ధనుష్‌తో చేస్తున్నా. తమిళ్, తెలుగు ముందు అనుకున్నాం. ఇక ఓటిటితో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. పైగా ధనుష్‌కి హిందీలో మంచి మార్కెట్ ఉంది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్‌లో ఉంటుంది. అందుకే మల్టీ లాంగ్వెజెస్ సినిమాలా ప్లాన్ చేశాం.

Shekhar Kammula Interview about ‘Love Story’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News