Friday, May 3, 2024

రిటైల్ డిపాజిటర్లకు ప్రతికూల రాబడి

- Advertisement -
- Advertisement -
Negative returns for retail depositors
వడ్డీపై పన్నులను సమీక్షించుకోవాలి: ఎస్‌బిఐ

న్యూఢిల్లీ : రిటైల్ డిపాజిటర్లు తమ రాబడులను పరిశీలించుకోవాలని దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ సూచించింది. డిపాజిటర్లు తమతమ బ్యాంక్ డిపాజిట్లపై ప్రతికూల రాబడులను పొందుతున్నారని, సంపాదిస్తున్న వడ్డీపై పన్నులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని బ్యాంక్ తెలిపింది. డిపాజిటర్లు అందరికీ కాకపోయినా, రోజువారీ అవసరాల కోసం వడ్డీపై ఆధారపడే సీనియర్ సిటిజెన్‌లు తమ డిపాజిట్లను సమీక్షించుకోవాల్సి ఉందని సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. వ్యవస్థలో మొత్తం రిటైల్ డిపాజిట్లు రూ.102 లక్షల కోట్లకు పెరిగాయని వారు తెలిపారు. ప్రస్తుతం డిపాజిటర్లు అందరికీ రూ.40 వేలకు పైగా వడ్డీ ఆదాయం క్రెడిట్ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును కట్ చేస్తున్నాయి. ఏడాదికి రూ.50 వేలు ఆదాయం దాటితే సీనియర్ సిటిజన్లకు పన్నుల సెటిన్ చేస్తారు. తగ్గిన వడ్డీ రేట్లతో డిపాజిటర్లలో నిరుత్సాహం ఉంది. ప్రస్తుత పన్నులను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News