Sunday, May 5, 2024

ముందస్తుగానే తునికాకు సేకరణ

- Advertisement -
- Advertisement -

ముందస్తుగానే తునికాకు సేకరణ
రాష్ట్ర అటవీ శాఖ కీలక నిర్ణయం

Tunikaku collection

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న తునికాకు సేకరణ సీజన్‌ను ముందస్తుగా మొదలు పెట్టాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. వచ్చే సీజన్ తునికాకు సేకరణ ఏర్పాట్లపై బిడి లీఫ్ అసోసియేషన్ సభ్యులతో అటవీ శాఖ ఉన్నతాధికారులు బుధవారం అరణ్యభవన్‌లో సమావేశం అయ్యారు.
అడవిని కాపాడటం, అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఈసారి సీజన్‌ను నవంబర్ నెల నుంచే మొదలుపెడుతున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్. శోభ తెలిపారు. దీని కోసం ఈసారి 242 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత యేడాది మాదిరిగానే అన్‌లైన్‌లో వేలం ద్వారా యూనిట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. వేసవి ప్రారంభం నుంచి అగ్ని ప్రమాదాలను నివారించటంలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ చేసే కాంట్రాక్టర్లు ఫైర్ వాచర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో అదనపు పిసిసిఎఫ్‌లు సిద్దానంద్ కుక్రేటీ, ఎకె. సిన్హా, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, ఆదిలాబాద్, వరంగల్ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు రామలింగంతో పాటు ఆశ, బిడి లీఫ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News