Tuesday, May 14, 2024

నటుడు అల్లు అర్జున్‌కు ఆర్‌టిసి నోటీసులు

- Advertisement -
- Advertisement -

TSRTC notices to actor Allu Arjun

హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్‌కు టిఎస్ ఆర్‌టిసి ఎండి సజ్జనార్ మంగళవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో టిఎస్‌ఆర్‌టిసి ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు అధికారులు లీగల్ నోటీస్‌లు పంపారు. అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై ఆర్‌టిసి ఎండి సజ్జనార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్‌టిసి బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని సజ్జనార్ సూచించారు. ఈ ప్రకటనపై ఆర్‌టిసి ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా చాలా మంది ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఏమాత్రం సమంజసం కాదని సజ్జనార్ పేర్కొన్నారు. టిఎస్‌ఆర్‌టిసి ఎన్నో ఏళ్లుగా సామాన్యుల సేవలో ఉందని, అలాంటి సంస్థను కించపర్చినందుకే రాపిడోకు, అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చినట్టు సజ్జనార్ పేర్కొన్నారు.

ఆర్‌టిసిని ప్రోత్సహించాలి 

హీరో అల్లు అర్జున్ ఆర్‌టిసిని కించపరుస్తూ నటించిన రాపిడో ప్రకటనపై చాలా అభ్యంతరాలు వచ్చాయని, అదేవిధంగా ఈ ప్రకటనపై ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి విమర్శలొచ్చాయని ఎండి వివరించారు. ఆర్‌టిసి బస్సులలో ప్రయాణాన్ని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని ఎండి సజ్జనార్ సూచించారు. టిఎస్‌ఆర్‌టిసి ఎన్నో ఏళ్లుగా ప్రజల సేవలో ఉందని,ఇకపై బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు ఎండి తెలిపారు. అదేవిధంగా ఇకనుండి బస్సుల్లో పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు పెడుతున్నట్టు ఎండి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News