Tuesday, April 30, 2024

2022లో స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ ఆరంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్‌ను 2022న భారత్ ప్రారంభించబోతున్నది. ఈ ప్రాజెక్టు కింద ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను తయారుచేస్తారు. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ లేక అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ విమానం(ఎఎంసిఎ)కు అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫీచర్లు, అలాగే సూపర్‌క్రూయిజ్ సామర్థం ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఖరారు పత్రాలను భద్రతపై ఏర్పడిన క్యాబినెట్ కమిటీ(సిసిఎస్) అప్రూవల్ కోసం పంపించారు. ఈ విషయాన్ని మిలిటరీలోని ఉన్న వర్గాలు తెలిపాయి. ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ తయారుచేయడం చాలా ఖర్చుతో, సంక్లిష్టతలతో కూడుకున్నది. ఇప్పటి వరకు అమెరికా ఎఫ్/ఎ-22ర్యాప్టర్, ఎఫ్-35 లైట్నింగ్-2 జాయింట్ స్ట్రయిక్ ఫైటర్, చైనా చెంగ్డూ జె-20, రష్యా సుఖోయ్-57 మాత్రమే ప్రపంచంలో పనిచేస్తున్నాయి. ఇక 25 టన్నుల బరువుండే అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎఎంసిఎ)ల తయారీ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 15000కోట్ల ఖర్చు కాగలదని అంచనా. అయితే ఎఎంసిఎలు 2035నాటికి సైన్యంలో చేర్చుకోబడతాయట. ఆలోగా 73 తేజా యుద్ధ విమానాలు సైన్యంలో చేరుతాయంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News