Sunday, May 5, 2024

టీకా తీసుకోనివారు ఎక్కడికీ వెళ్లకూడదు

- Advertisement -
- Advertisement -

German conditional lockdown to Corona control

బెర్లిన్ : కరోనా కట్టడికి జర్మనీ షరతులతో కూడిన లాక్‌డౌన్ విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఆమె తరువాతి అధికార వారసులు ఓలాఫ్ స్కోల్డ్ గురువారం సంయుక్తంగా ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకోనివారిని బయట ఎక్కడికీ కనీసం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సినిమాహాళ్లు, తదితర ముఖ్యమైన చోట్లకు వెళ్లడాన్ని నిషేధించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధం నుంచి టీకా తీసుకున్నవారికి మినహాయింపు కల్పించారు. ఈ నిబంధనలు పార్లమెంటులో ఆమోదం పొందితే ఫిబ్రవరి నుంచి అమలు లోకి వస్తాయి. ఈ కఠినమైన నిబంధనల్లో టీకా తీసుకోని వారు మరో ఇంటికి చెందిన ఇద్దరిని మాత్రమే కలుసుకోవచ్చు. వారంలో లక్ష మంది జనాభాలో 350 కు మించిన కేసులు నమోదైతే అప్పటి స్థాయి, తీవ్రత బట్టి ఆయా ప్రాంతాల్లో బార్లు, నైట్ క్లబ్బులు తప్పనిసరిగా మూసివేయవలసి ఉంటుంది. సాసర్ క్రీడా పోటీలు వంటి భారీ కార్యక్రమాలకు ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. కరోనా కేసులతో అల్లాడుతున్న జర్మనీలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తుండడంతో ఈ విధమైన కఠిన నిబంధనలను ప్రభుత్వం అమలు లోకి తీసుకువస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News