Tuesday, April 30, 2024

‘బంగార్రాజు’ నుంచి ‘నా కోసం’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Naa Kosam' Lyrical Song released from 'Bangarraju'

హైదరాబాద్: కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ‘నా కోసం అనే ఈ పాటను సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించాడు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ మోలోడి సాంగ్ ఆకట్టుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైలి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు.

‘Naa Kosam’ Lyrical Song released from ‘Bangarraju’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News