Saturday, April 27, 2024

‘ఫోన్‌ట్యాపింగ్‌ తోనే సమంత-నాగచైతన్య విడిపోయారు’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో పోలీస్ అధికారుల పేర్లు బయటపడుతున్నాయి. సినీ ప్రముఖులు, వ్యాపారస్థులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖలు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు సమంత- నాగచైతన్యం విడాకులు తీసుకోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమని ఆయన తెలిపారు. యూట్యూబ్ చానెల్‌లో తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడారు.

బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని, ఆయన రాజకీయాలు కాకా మందుల వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉందని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బిఆర్‌ఎస్ పాలనలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బిజెపి నేత రఘునందన్ రావు డిజిపి ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ ప్రమేయం ఉండొచ్చని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిందని కెటిఆర్ వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చని, దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని కెటిఆర్ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News