Sunday, May 26, 2024

జులై 1న టెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

TET results release on July 1st

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జులై 1వ తేదీ(శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈనెల 27వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ ప్రకటించలేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెట్ ఫలితాలపై అధికారులతో చర్చించారు. జాప్యం చేయకుండా జులై 1న ఫలితాలు విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈనెల 12న జరిగిన పరీక్షల్లో పేపర్ 1కు 3 లక్షల 18 వేల 506 మంది, పేపర్ 2కు 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు. ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. పేపర్ 1పై 7 వేల 930.. పేపర్ 2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. తుది కీ ఇంకా విడుదల కాలేదు. ఫలితాలతో పాటే తుది సమాధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన, టెట్ కన్వీనర్ రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News