Monday, May 12, 2025

పాకిస్థాన్ తగిన ప్రతిఫలం చెల్లించింది: రాజీవ్ ఘాయ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌ని చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఈ ఆపరేషన్‌లో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆపరేషన్‌ గురించి డిజిఎంఒ(DGMO) రాజీవ్‌ ఘాయ్ వివరించారు. పహల్గామ్ దాడి తర్వాత బలమైన సమాధానం చెప్పాలని నిర్ణయించామని రాజీవ్ ఘాయ్(Rajiv Ghai) తెలిపారు. ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని ఆయన అన్నారు.

సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించామని, స్పష్టమైన ఆధారాలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామని రాజీవ్ ఘాయ్(Rajiv Ghai) పేర్కొన్నారు. కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించామని.. గగనతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను చేధించామని ఆయన అన్నారు. లక్ష్యాల చేధనలో భారత్‌వైపు ఎలాంటి నష్టం జరగకుండా కచ్చితంగా దాడి చేశామని తెలిపారు.

ఉగ్ర శిబిరాలపై దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని డిజిఎంఒ(DGMO) వెల్లడించారు. ఉగ్ర శిబిరాలపై దాడులతో పాకిస్థాన్ చలించిపోయిందని అన్న ఆయన.. ఈ దాడుల తర్వాత పాక్.. పౌరులపై దాడులు చేసిందని మండిపడ్డారు. పౌరులపై దాడులకు పాకిస్థాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని అన్నారు. భారత్‌కు ఉగ్రవాదం అంతం చేయడం తప్ప ఇంకో మార్గం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News