Tuesday, August 5, 2025

‘మాస్ జాతర’ నుంచి ‘ఓలే ఓలే’ లిరికల్ వీడియో రిలీజ్

- Advertisement -
- Advertisement -

మాస్ మహరాజా రవితేజ చాలాకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ‘ఈగెల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పేరు ‘మాస్ జాతర’ (Mass Jatara). భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘తు మేరా లవర్’ పాట లిరికల్ వీడియో విడుదలై ఓ ఊపు ఊపేసింది.

తాజాగా ఈ సినిమా (Mass Jatara) నుంచి ‘ఓలే ఓలే’ అంటూ సాగే మరో పాట లిరికల్ ‌వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే పాటని పాడారు. భీమ్స్‌తో పాటు రోహిణి సొర్రాట్ ఈ పాటని ఆలపించారు. ఈ పాటకి భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు. ప్రసుతానికి ఈ పాట సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News