Thursday, August 7, 2025

భారత్‌పై ట్రంప్ మరో పిడుగు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. రష్యానుంచి చమురుకొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 24 గంటల్లో అదనంగా మరిన్ని సుంకాలు విధిస్తానని చెప్పిన ఆయ న అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌పై అమెరికా ఇప్పటికే 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విష యం తెలిసిందే. తాజాగా విధించిన సుంకాలతో కలిపి భారత్‌నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పై అమెరికా విధించే సుంకాలు 50 శాతానికి చేరుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆ ర్డర్‌పై ట్రంప్ సంతకాలు చేశారు. రష్యానుంచి ప్ర త్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తునందుకే ఈ టారిఫ్ విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆ ర్డర్‌లో ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల్లో భాగంగా

ఇప్పటికే విధించిన 25 శా తం సుంకాలు ఈ నెల 7నుంచి అమలులోకి రా నుండగా, తాజాగా విధించిన 25శాతం సుంకా లు ఆగస్టు 27నుంచి వర్తింపజేయనున్నట్లు ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈసుంకాలకు ప్రతీకారంగా భారత్ ఏదైనా సుం కాలు విధించాలని ప్రయత్నిస్తే ఈ టారిఫ్‌లను అ ధ్యక్షుడు సవరించవచ్చని వైట్‌హౌస్ ఒక ప్రకటన లో స్పష్టం చేసింది.దీంతో చైనా తర్వాత ఆసియా లో అత్యధిక సుంకాలు ఎదుర్కొంటున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా 51 శాతం సుంకాలు విధిస్తోంది. మలేసియాపై 25 శాతం, శ్రీలంకపై 30 శాతం, వియత్నాంపై !9, ఇండోనేసియాపై 19 శాతం చొప్పున ట్రంప్ సుంకాలు విధించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా జపాన్‌పై 15 శాతం టారిఫ్ విధించారు.

మిత్రుడిపై ఇప్పటికీ స్పందించని మోడీ: కాంగ్రెస్
తాజా పరిణామంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించింది. నరేంద్ర మోడీ మిత్రుడు ట్రంప్ భారత్‌పై మొత్తగా 50 శాతం సుంకాలు విధించారు. ట్రంప్ నిరంతరం తమ దేశంపై చర్యలు తీసుకొంటున్నా ప్రధాని మోడీ మాత్రం కనీసం ఆయన పేరును సైతం ప్రస్తావించడం లేదని మండిపడింది. ఇప్పటికైనా ప్రధాని ధైర్యం ప్రదర్శించాలని, ట్రంప్ చర్యలకు తగిన సమాధానం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News