- Advertisement -
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి ః కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి కొనసాగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులపై అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, తహసిల్దార్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, ఆర్అండ్బి ఈఈ దేశ నాయక్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -