- Advertisement -
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలపై ప్రధాని మోడీ స్పందించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని, భారత్ రాజీ పడే ప్రసక్తే లేదని మోడీ కౌంటర్ ఇచ్చారు. రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై రెండుసార్లు అదనంగా 25 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. “మాకు రైతుల ప్రయోజనాలే ముఖ్యం. భారత్ ఎప్పుడూ రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడదు. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని నాకు తెలుసు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. దేశంలోని రైతులు, మత్స్యకారుల కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం” అని అన్నారు.
- Advertisement -