మేషం: దీర్ఘకాలికంగా వేదిస్తున్న సమస్యలు తీరి ఊరట పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం.
వృషభం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది.
మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందుతారు.
కర్కాటకం: స్థిరాస్థి వివాదాలు తీరుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నఅవకాశాలు పొందుతారు.
సింహం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్త్రా లాభాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం.
కన్య: బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
తుల: మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు.
వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు కొంత వరకు తీరుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత వరకు తీరుతాయి.
ధనస్సు: ప్రముఖుల కలయిక. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం: రుణాల నుండి విముక్తి పొందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.
కుంభం: పనులలో ఆటంకాలు ఎదురైన చికాకులు కొంత వరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి.
మీనం: పట్టుదల పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని ఆహ్వానాలు అందును.