- Advertisement -
లక్నో: ఇంటి నుంచి పారిపోయిన యువతి తన సోదరిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తితావి ప్రాంతంలో ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోవడంతో ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి వరుసకు చెల్లి అయ్యే మరో యువతిని పెళ్లి చేసుకొని పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది. గత రెండు సంవత్సరాల ప్రేమంచుకున్నామని, ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకోవడంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పరస్పర అంగీకారంతోనే తాను వరుడిగా మారి తన చెల్లిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఆ దంపతులకు పోలీసులు భద్రత కల్పించారు.
- Advertisement -