- Advertisement -
మిర్చి బజ్జీ మనిషి ప్రాణం తీయడమేంటి నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ ఇది నిజం.బజ్జీ తన ప్రాణం తీస్తుందని అతడు ఊహించలేకపోయాడు. అలా బజ్జీ తింటూ ఉండగానే అతడిని ఆ బజ్జీ రూపంలో మృత్యువు బలితీసుకుంది. గొంతులో బజ్జీ ఇరుక్కుని ఊపిరి ఆడకపోవడంతో 55 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా,మిడ్జిల్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్ రామ్ (55) గ్రామంలోని ఓ హోటల్ వద్ద వేడి వేడి బజ్జిలు తింటుండగా గొంతులో మిరపకాయ బజ్జి ఇరుక్కుని ఊపిరాడక కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
- Advertisement -