- Advertisement -
మన తెలంగాణ/దండేపల్లి : పంట పొలాలకు సాగు నీరు అందించే కడెం కాలువలకు మరమ్మత్తులు లేక సాగు నీరు రోడ్లపై వృధాగా పోతున్న వైనమిది. దండేపల్లి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో గల 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువలో చెత్త చెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోయి సాగు నీరు ఆదివారం రోడ్డుపై వృధాగా ప్రవహిస్తుంది. ప్రతి సారి కాలువలో పూడిక తీయకపోవడంతో సాగు నీరు రోడ్డు ప్రై ప్రవహిస్తున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువ పరిధిలో నర్సాపూర్, దండేపల్లి గ్రామాల రైతులు వరి పంటను సాగు చేస్తారు. సాగు నీరు వృధా కావడంతో నర్సాపూర్ గ్రామంలోని ఆయకట్టు చివరి వరకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి పారుదల అధికారులు స్పందించి సాగు నీరు వృధా కాకుండా మరమ్మత్తులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
- Advertisement -