Monday, August 11, 2025

తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ చేసింది.. కెటిఆర్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. తెలంగాణలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఓటు చోరీ చేశారన్నారు. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR), 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ఓటర్ చోరీ’ (ఓట్ల దొంగతనం) జరిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఈ మార్చ్‌లో 25 ప్రతిపక్ష పార్టీల నుండి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు.ఈ ర్యాలీపై కెటిఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ విమర్శలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై రాహుల్ గాంధీని కెటిఆర్ నిలదీశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ చేసింది కూడా ఓటు చోరీ కాదా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 హామీలు 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి గెలిచి.. ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ఉండటం ఓటు చోరీ కిందకి రాదా అని మండిపడ్డారు. బిజెపికి వ్యతిరేకంగా ఓటు చోరీపై పోరాడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో మీరు చేసేది ఎంటి అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News