Monday, August 11, 2025

మంత్రి కందుల దుర్గేశ్‌తో ముగిసిన నిర్మాతల భేటీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి కందుల దుర్గేశ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ ముగిసింది. సోమవారం దిల్‌రాజు ఆధ్వర్యంలో బన్నివాస్‌, దానయ్య, నాగవంశీ, బీవీఎస్ఎన్‌ ప్రసాద్ తో సహా 14 మంది నిర్మాతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో తాజా పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సినీ కార్మికుల సమస్యలపై ఫెడరేషన్‌, ఛాంబర్‌ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని కందుల దుర్గేష్‌ అన్నారు.

అంతకుముదు నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ..ఎపి ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నామని.. దానికి సంబంధించిన పర్మిషన్‌ కోసమే మంత్రి దుర్గేశ్‌ను కలిసినట్లు తెలిపారు. “సినీ పరిశ్రమ సమస్యలు అంటే తెలుగు రాష్ట్రాల సమస్య.. అందుకే ఎపి ప్రభుత్వ సహకారం కోసం వచ్చాం. పరిశ్రమలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. తమిళనాడు నుంచి తెలంగాణకు వచ్చాం..అలాగే తెలంగాణ నుంచి ఎపికి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎపిలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News