Saturday, September 20, 2025

శనివారం రాశిఫలాలు (20-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా మేలు జరుగుతుంది.

వృషభం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపలకు దూరంగా ఉండండి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి.

మిథునం – బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటకం – అమ్మకాలకు సంబంధించి మెలకువలు పాటించండి. పెట్టుబడుల విషయమై చేసే చర్చలు ఓ కొలిక్కి వస్తాయి. సంతాన యోగక్షేమాల గురించి ఆరా తీస్తారు. ఆరోగ్య నియమాలు పాటించండి.

సింహం – ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తారు. ఇందువలన మానసిక ప్రశాంతతకు కొంత భంగం వాటిల్లుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి.

కన్య –  పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

తుల – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.  కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం – భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.

ధనుస్సు – క్రయవిక్రయాలకు సంబంధించి అంశాలు సానుకూల డతాయి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

మకరం – సమాజపరంగా వచ్చినటువంటి మార్పులు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు మానసిక ప్రశాంతతను భంగ పరుస్తాయి. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి.

కుంభం – వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాలకు ప్రాధాన్యతని ఇస్తారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు మెలకువలు అవసరం.

మీనం – ఆత్మవిశ్వాసం మనోధర్యం పెరుగుతాయి.ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిడుదుడుకులు ఏర్పడవు. మొండి బాకీలు కొంతమేర వసూలు అవుతాయి. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు.

Weekly rasi phalalu next week

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News