Saturday, September 20, 2025

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఒమాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ (Team India) ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే షా ఫైజల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి శుభ్‌మాన్ గిల్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (1) ఉన్నారు.

అయితే ప్రస్తుతం జరుగుతుంది నామమాత్రపు మ్యాచే. ఇప్పటికే భారత్ (Team India) సూపర్-4కి దూసుకెళ్లింది. కానీ, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భారత్ భావిస్తోంది. మరోవైపు భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు సూపర్‌-4కి అర్హత సాధించాయి. సెప్టెంబర్ 21వ తేదీన భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి తలపడనుంది.

Also Read : వన్డే ప్రపంచకప్ కోసం శ్రేయ ఘోషల్ ప్రత్యేక పాట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News