Sunday, September 21, 2025

గుడివాడ ఎంఎల్ఎను అడ్డుకున్న మహిళలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: గుడివాడ టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రామును టిడ్కో కాలనీ వాసులు అడ్డుకున్నారు.  టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్లగా ఆయనను కాలనీ వాసులు అడ్డుకొని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయిన కూడా తమ లోన్లు మాఫీ చేయలేదని ఎంఎల్ఎ ను టిడ్కో కాలనీ మహిళలు నిలదీశారు. లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారని, బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఎంఎల్ఎకు మొర పెట్టుకున్నారు.

Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?

లోన్లు కట్టకపోతే అధికారులు తమ ఇళ్లను జప్తు చేస్తామంటున్నారని, తమకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను మహిళలు అడిగారు. లోన్లు మాఫీ చేయించాడనికి బ్యాంకు వాళ్లతో మాట్లాడుతున్నామని, ఇంకా సమయం పడుతుందని, ఇప్పటికిప్పడే చేయాలంటే చేయలేమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్ళిపోయాడు. 2024 ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫ్రీగా ఇళ్లు ఇస్తామని రాము హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్ల లోన్లన్నింటినీ మాఫీ చేస్తానని వాగ్ధానం చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News