కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లోకా ఛాప్టర్-1 చంద్ర’. తెలుగులో ‘కొత్త లోకా’ (Kotha Lokah) అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదలైంది. అతీంద్రియ శక్తులు, ఫాంటసీ కలగలిపిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్‌లో ఉండగానే.. ఒటిటి విడుదల గురించి సోషల్‌మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివర్లో ఈ సినిమా ఒటిటిలో సందడి చేస్తుందని.. కొన్ని సినిమా వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. అయితే ఇటువంటి పుకార్లను నమ్మవద్దని చిత్ర నిర్మాత, హీరో దుల్కర్ సల్మాన్ తెలిపారు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి ఉండాలని ఆయన సూచించారు.
ఈ సినిమాను (Kotha Lokah) డొమినిక్ అరుణ్ తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్‌లో విడుదలైంది. 30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్లు వసూలు చేసి.. అత్యధిక కలెక్షన్లు చేసిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ ఘనత సాధించడం విశేషం. అంతేకాక.. పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్‌లాల్‌ను కలిసి నటించిన ‘ఎల్2-ఎంపూరన్’ సినిమా కలెక్షన్లను ఈ సినిమా దాటేసి రికార్డు సృష్టించింది.
Also Read : ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్