Monday, September 22, 2025

బిసిసిఐ అధ్యక్ష రేసులో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్!

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ: వచ్చే ఆదివారం భారత్ క్రికెట్ బోర్డు(బిసిసిఐ) ఎజిఎం మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో బిసిసిఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నేఫథ్యంలో అధ్యక్ష రేసులో మాజీలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనూహ్యంగా ఓ ఫస్ట్ క్లాస్ క్రికెట్ పేరు చర్చలోకి వచ్చింది. ఆదివారం బిసిసిఐ పెద్దలు ఈ పేరుపైనే చాలా సమయం చర్చించినట్టు తెలుస్తోంది.

Also Read: భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

దేశవాలిల్లో ఢిల్లీ టీమ్‌కు సారధి అయిన మిథున్ మన్హాస్. బిసిసిఐ అధ్యక్ష రేసులో ప్రధానంగా మిథున్ పేరు వినపడుతోంది. టీమిండియాకు ఒక్క మ్యాచ్ ఆడని మిథున్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగలు సాధించాడు. 130 లిస్ట్‌ఎ మ్యాచ్‌లు ఆడిన మన్హాస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సయితం 55 మ్యాచ్‌లు ఆడాడు. చైన్నై, డిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్‌కు ప్రాతినధ్యం వహించాడు. 1997 నుంచి 2017 వరకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మన్హాస్ అద్భుమైన ఆటతీరుతో కెరీర్‌ను కొనసాగించి, ఇటీవలె క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా, బిసిసిఐ అధ్యక్షుడిగా మిథున్ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News