న్యూయార్క్: అమెరికాలోని కరోలీనాలో భారత సంతతి మహిళ హత్య దారుణ హత్యకు గురైంది. దుండగుడు స్టోర్‌లోకి చొరబడి కౌంటర్‌లో ఉన్న గుజరాతీ మహిళను కాల్చి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ అనే మహిళ సౌత్ కరోలీనాలోని గ్యాస్ స్టేషన్ సమీపంలో స్టోర్ నిర్వహిస్తోంది. స్టోర్ లోకి దుండగుడు చొరబడి ఆమె కళ్లలోకి టార్చ్ లైట్ వేశాడు. డబ్బులివ్వమని అడిగితే ఆమె డబ్బులు కూడా ఇచ్చింది. దుండుగుడు ఆమె దగ్గరికి వస్తుండడంతో ప్లాస్టిక్ కవర్ అతడిపై విసరడానికి ప్రయత్నించింది. దీంతో దుండగుడు కిరణ్ పటేల్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దుండుగుడు జేడాన్ మ్యాక్(21)గా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: రూ.15 వేల కోట్ల భూమి సేఫ్